AP Govt : కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు లేఖ రాసిన న్యాయశాఖ కార్యదర్శి
అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో 25 శాతం మంది ఈ రీజియన్‌లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది...
AP Govt : కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా గళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్ట్ (High Court)బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సర్కార్ పేర్కొంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకు వచ్చిన లేఖతో ప్రక్రియను న్యాయశాఖ మొదలుపెట్టింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు.
AP Govt…
రాయలసీమలోనినాలుగు జిల్లాలు కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్ట్‌లో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి కోరారు. బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర మొత్తం జనాభాలో 4.95 కోట్లు ఉండగా అందులో రాయలసీమలో రీజియన్‌లో 1.59 కోట్ల మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో 25 శాతం మంది ఈ రీజియన్‌లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్ట్ బెంచ్‌లు ఏర్పాటు చేశారని అధికారులు గుర్తుచేశారు. రాయలసీమ రీజియన్ నుంచి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదని అధికారులు పేర్కొన్నారు. హైకోర్ట్‌లో ఈ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో రెండు లేదా మూడు ఏళ్ల కంటే పెండింగ్‌లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయశాఖ కార్యదర్శి సునీత కోరారు.
ఇటీవలన్యాయశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు, మంత్రివర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలుచేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
Also Read : Errabelli Dayakar : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్