AP High Court : బోరుగడ్డ సోషల్ మీడియా పోస్టుల కేసులో బెయిల్ నిరాకరించిన హైకోర్టు
ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు...
High Court : వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ అనిల్ కుమార్‌పై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.
AP High Court Comment
విచారణ సందర్భంగా పిటిషనర్ బోరుగడ్డ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా, పిటిషనర్ అనిల్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసుల్లో ఇప్పటికే రెండు కేసుల్లో ఛార్జ్ షీట్ సైతం దాఖలు అయ్యిందని హైకోర్టుకు ప్రాసిక్యూషన్ తెలిపారు. ఈ కేసుల్లో బీఎన్ఎస్ సెక్షన్ 111 వర్తిస్తుందని ఆయన ధర్మాసనానికి వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బోరుగడ్డ వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.
Also Read : Tirumala : మరోసారి శ్రీవారి ఆలయంపై విమానం వెళ్లడంపై భక్తుల ఆగ్రహం