AP High Court: వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై హైకోర్ట్ సీరియస్
వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై హైకోర్ట్ సీరియస్
AP High Court : వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. ఒక మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి ? అని నిలదీసింది. మాజీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేం అంటూ… వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టింది హైకోర్టు.
AP High Court Serious
కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్రంగా మందలించింది. మహిళా ఎమ్మెల్యే పై ఆ వ్యాఖ్యలు ఏంటని నిలదీసిన హైకోర్ట్… ఓ మాజీ ఎమ్మెల్యే ఆయి ఉండి… ప్రస్తుత ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది. మహిళా ఎమ్మెల్యేను గౌరవించేది ఇలాగేనా అని ప్రశ్నించింది. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడిన హైకోర్ట్… అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని ఆదేశాలిచ్చింది.
అంతేకాదు మీ వ్యాఖ్యతో న్యూసెన్స్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన హైకోర్ట్ (AP High Court)… ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి తరపు న్యాయవాది సుభోద్ అభ్యర్ధనను తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, పిటిషనర్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని న్యాయవాది సుభోద్ కోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ! తీర్పు రిజర్వు !
జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును ఎన్సీఎల్టీ రిజర్వు చేసింది. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ అక్రమంగా షేర్లను బదిలీ చేశారంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బదలాయింపును రద్దు చేయాలని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు ఒప్పందం మేరకే షేర్ల బదిలీ జరిగిందని షర్మిల, విజయమ్మ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన ఎన్సీఎల్టీ… తీర్పును రిజర్వు చేసింది.
Also Read : CM Chandrababu Naidu: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు భేటీ
