AP High Court : ఏపీలో అక్రమ మైనింగ్..అధికారుల పై నిప్పులు చెరిగిన ధర్మాసనం

చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

AP High Court : రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి చాలా పిటిషన్లు వచ్చాయని కోర్టు తెలిపింది. అధికారులు అడ్డుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

AP High Court Serious

అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సెట్టిప్పం తంగల్ సర్పంచ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా సాగిందంటూ వారి తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చిత్తూరులో అక్రమ మైనింగ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోకుంటే మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Also Read : BRS MLA’s Strike : సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న అసెంబ్లీ సిబ్బంది

Leave A Reply

Your Email Id will not be published!