AP New Cabinet : ఏపీలో ఏర్పాటు కాబోయే కేబినెట్ లో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న 24 మంది తమ పదవులకు రాజీనామా చేశారు.
నిర్దేశించిన ఫార్మాట్ లో ప్రభుత్వం గవర్నర్ కు పంపనుంది. ఈ మేరకు హరిచందన్ సంతకం చేయడం ఖాయం.
ఈ తరుణంలో సామాజిక, కుల సమీకరణాల మేరకే కొత్త వారికి కేబినెట్(AP New Cabinet) లో చోటు దక్కనుంది.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కమ్మ, కాపు, క్షత్రియ, మైనార్టీ, మహిళా వర్గాలకు ప్రయారిటీ ఇవ్వనున్నారు సీఎం జగన్ రెడ్డి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పవర్ లోకి రావడానికి ఇప్పటి నుంచే ప్లాన్ (AP New Cabinet)చేస్తున్నారు.
ఇందులో భాగంగా గతంలో కొలువు తీరిన వెంటనే రెండున్నర ఏళ్ల పాటు కేబినెట్ ఉంటుందని, ఆ తర్వాత కొత్త వారిని తీసుకుంటానని ప్రకటించారు.
కరోనా కారణంగా కొంత లేట్ అయినప్పటికీ ఈసారి కేబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు.
గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో ఒకింత ఇబ్బంది పడ్డా ఈసారి ఎవరెవరికి ఛాన్స్ ఉంటుందనే దానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఇక కులాలు, వర్గాలు, సమీకరణల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. ఇదే అంతిమం కాదని తెలుసుకోవాలి. బీసీ వర్గం నుంచి ధర్మాన ప్రసాదరావు,
తమ్మినేని సీతారాం, ముత్యాల నాయుడు, సతీష్ కుమార్, విడుదల రజని, జోగి రమేష్ , పార్థసారథి, మధు సూదన్ యాదవ్, కరణం ధర్మశ్రీ, ఉషాశ్రీ చరణ్ ఉన్నారు.
ఇక ఎస్సీ వర్గం నుంచి చిట్టబ్బాయ్, వెంకట్రావు, ఎలీజా, రక్షణ నిధి, నాగార్జున, సంజీవయ్య, శ్రీనివాసులు, పద్మావతి కి చాన్స్ దక్కనుంది. ఎస్టీ కమ్యూనిటీ నుంచి కళావతి, రాజన్న దొర, బాగ్యలక్ష్మి, ధన లక్ష్మి ఉన్నారు.
ఓసీ సామాజిక వర్గం నుంచి రోజా, చెవిరెడ్డి, రామకృష్నా రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి కి చాన్స్ దక్కనుంది. మైనార్టీ వర్గం నుంచి హఫీజ్ ఖాన్ , ముస్తఫా ఉన్నారు.
Also Read : మన భూగ్రహం – మన ఆరోగ్యం