AP News : ఇంద్రకులాద్రిపై దర్శనం ఇప్పించాలంటూ ప్రత్యక్షమైన నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి..

ఇన్ కమ్ టాక్స్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు

AP News : విజయవాడలోని ఇంద్రకీలాద్రి బయట నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. రెండున్నరేళ్లుగా ఫేక్ ఐడీ కార్డుతో ప్రయాణాలు చేస్తూ అమ్మవారి ప్రోటో కాల్ తో దర్శనం చేసుకుంటున్నాడు. ఆలయ సిబ్బందికి అనుమానం రావడంతో నిఘా ఉంచిన ఆలయ సిబ్బంది అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దింతో అతడి వ్యవహారం మొత్తం బైటపడింది.

AP News – Fake Income Tax Officer Viral

ఇన్ కమ్ టాక్స్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో(Kanaka Durga Temple) ప్రోటోకాల్ దర్శనం కావాలంటూ స్టోరీ చెప్తున్నాడు. చివరికి ఆ వ్యక్తిని దుర్గ గుడి సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంద్రకీ లాద్రిలోని అమ్మవారి ఆలయాన్ని ఆయన చాలాసార్లు దర్శించుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాచవరం ప్రాంతానికి చెందిన భరత్ భూషణ్ తాను ఐఆర్‌ఎస్ అధికారినని పేర్కొన్నాడు. దుర్గ గుడి సిబ్బందికి తనను తాను ఐటీ పర్సన్‌గా పరిచయం చేసుకుని ప్రొటోకాల్‌ దర్శనం కోసం అడిగాడు.

అయితే ఆలయ సిబ్బందికి అనుమానం వచ్చి మార్చి 5న అమ్మవారి దర్శనానికి వచ్చిన భరతభూషణ్‌ను ప్రశ్నించగా గుర్తింపు కార్డు చూపించాలని కోరారు. దీంతో పొంతన లేని సమాధానాలు, గుర్తింపు పత్రాలు చూపడంతో అనుమానం వచ్చిన దుర్గ గుడి సిబ్బంది వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఆ పేరుతో ఎవరూ లేరని ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాధానం రావడంతో దుర్గ గుడి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భరత్‌ భూషణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

Also Read : CM Revanth Reddy : రేపు ఢిల్లీలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరుకానున్న సీఎం

Leave A Reply

Your Email Id will not be published!