AP News : ఏపీ ఆరోగ్య శాఖలో డ్యూటీ కి డుమ్మా కొట్టిన 55 మందికి షాక్
శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త...
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగించింది. లోకాయుక్త అదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులనుప్రభుత్వం టర్మీనేట్ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ లోకాయుక్తకు నివేదిక పంపింది. తొలగింపునకు గురైన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని, వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
AP News Update
శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త.. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అదే సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా.. సెలవులు కూడా పెట్టకుండా.. ఎక్కువ కాలం విధులకు హాజరుకాని ఆ ప్రభుత్వ వైద్యులను వెంటనే గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగించాలని లోకాయుక్త స్పష్టం చేసింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలతో సదరు 55 మంది వైద్యులను గుర్తించి.. వారిని ఉద్యోగుల నుంచి తొలగించింది.
లోకాయుక్త ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఏపీ(AP) వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన 55 మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా.. ఇష్టం వచ్చినట్లు విధులకు హాజరుకాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read : PM Internship Scheme : పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ 2 వ విడత దరఖాస్తులు స్వీకరిస్తున్న సర్కార్