AP Politics : ఏపీ రాజకీయాల్లో మల్లి 2014 పొత్తులు కనబడనున్నాయా..?

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలతో చర్చలు జరిపారు

AP Politics : ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో విడివిడిగా చర్చల ఆధారంగా చంద్రబాబు పవన్ కూటమిని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు బీజేపీ టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారు ఉత్కంఠకు లోనవుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అధినేతల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఏఏ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే ప్రశ్న వెంటనే తలెత్తుతుంది. సీట్ల ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

అయితే ఇటీవలి చర్చల్లో ఏపీ(AP) బీజేపీ నాయకత్వం ఎనిమిది ఎంపీ సీట్లు, అసెంబ్లీలో 25 సీట్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గెలిచిన విశాఖ, నరసాపురం నియోజకవర్గాలతో పాటు అరకు, విజయవాడ, రాజంపేట, హిందూపురం, ఒంగోలు, నరసరావుపేట నియోజకవర్గాలను కూడా బీజేపీ కోరుతున్నట్టు సమాచారం.

AP Politics Update Viral

పురందేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. నరసాపురం నుంచి రఘురామ బీజేపీ టికెట్‌పై పోటీ చేయనున్నట్లు సమాచారం. విజయవాడ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సుజనా బరిలోకి దిగే అవకాశం ఉంది. రాజంపేట నియోజకవర్గంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదా సత్యకుమార్ ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు బీజేపీ 25 ఎమ్మెల్యే సీట్లు కూడా కోరుతోంది. దీంతో ఈ నియోజకవర్గాల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న టీడీపీ, జనసేన అభ్యర్థుల్లో భయాందోళన నెలకొంది. భారీ సంఖ్యలో అభ్యర్థులను బుజ్జగించడం టీడీపీ జనసేనకు సవాల్‌గా మారనుంది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలతో చర్చలు జరిపారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంతోనూ పవన్ భేటీ కానున్నారు. పవన్ భేటీ తర్వాత టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Gruha Jyothi: ‘గృహజ్యోతి’ పథకం కోసం వివరాలు సేకరిస్తున్న విద్యుత్ సిబ్బంది

Leave A Reply

Your Email Id will not be published!