AP Rains : ఏపీలో ఆయా ప్రాంతాల వారిని వీడని వానలు
పశ్చిమమధ్యమరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం కొనసాగుతోంది...
AP Rains : రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు(AP Rains) పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే తీరం వెంబడి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
AP Rains Update
పశ్చిమమధ్యమరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో అల్పపీడనం ఉత్తర దిశగా కదలనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం(Bay Of Bengal)లో ప్రవేశించిన తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఉత్తర-ఈశాన్య దిశగా వాయుగుండంగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రానున్న 24 గంటలలో కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, మన్యం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో రానున్న రెండు రోజులు పాటు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా..గడిచిన 24 గంటలలో విజయనగరం జిల్లా మెంటాడలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో భారీగా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు భయాందనలో ఉన్నారు.
Also Read : Minister Satyakumar : కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అగౌవరపరిచింది