AP Rains : ఏపీలో ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది...
AP Rains : బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేసింది.
AP Rains Update..
అటు సోమవారం నవంబర్ 11న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Also Read : CM Revanth Reddy : అన్నదాతల ఆందోళనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు