AP Rains : ఏపీలో ఇంకా వర్షాలు ఉన్నాయా..ఇదిగో అప్డేట్

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది...

AP Rains : ఈరోజు అనగా 2024, డిసెంబర్ 3న ఉదయం 8.30 గంటల సమయంలో కోస్టల్ కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల అవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజులు పాటు మధ్య అరేబియా సముద్రం లో కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్(AP), యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.

AP Rains – ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :

ఈరోజు,రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణకోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
ఈరోజు,రేపు:-

తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:
ఈరోజు:-

తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు:-

తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

Also Read : Eknath Shinde : ఆసుపత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం షిండే

Leave A Reply

Your Email Id will not be published!