AP Rice Scam : ఏపీ రైస్ స్కామ్ కేసులో 3కి బెయిల్ మంజూరు చేసిన మొబైల్ కోర్టు

ఈ కేసులో వీరిని ఈ నెల 12వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

Rice Scam : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ నుంచి బియ్యం మాయం కేసులో అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులలో ముగ్గురికి స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి శనివారం బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో వీరిని ఈ నెల 12వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AP Rice Scam Case Updates

ఇందులో ఏ7గా ఉన్న మాతా వెంకటేశ్వరరావు (ధాన్యం వ్యాపారి), ఏ9 గోపిశెట్టి నాంచారయ్య (ఆటోడ్రైవర్‌), ఏ11 కందుల బాపూజీలకు (బియ్యం వ్యాపారి) బెయిల్‌ మంజూరైంది. మరో నిందితుడు, ఈ కేసులో ఏ8గా ఉన్న పంతగాని నాగేశ్వరరావు శనివారం బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగాయలంక ఎంఎల్‌ఎస్‌ (మల్టీ లెవల్‌ స్టాక్‌) పాయింట్‌లో నాగేశ్వరరావు గతంలో పనిచేశారు. ఇక… ఏ10గా ఉన్న డొక్కు నాగరాజు ఇటీవల మరణించారు.

Also Read : CM Revanth Reddy : సింగపూర్ పర్యటనలో బిజీ బిజీగా సీఎం..3500 కోట్ల పెట్టుబడులు

Leave A Reply

Your Email Id will not be published!