APSRTC : రాష్ట్రంలో ఉచిత బస్సు అమలుపై మంత్రి కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.....
APSRTC : త్వరలో మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ద్వారకా బస్ స్టేషన్‌లో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) ప్రారంభించారు.
APSRTC Updates
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy)మాట్లాడుతూ… కార్గో సర్వీస్‌ను డోర్ డెలివరీ ప్రారంభించటం సంతోషంగా ఉందని చెప్పారు. గ్రామాల నుంచి నగరాలకు అనుసంధనం చేసే ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతంమన్నారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావటానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. సంస్థలో పని చేసే వారికి మంచి ఫలితాలు అందించేందు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భారత్ దేశంలో నంబర్ వన్‌గా ఏపీఎస్ఆర్టీసీను నిలబెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంచి బస్సులను ప్రయాణికుల కోసం సిద్ధం చేశామన్నారు. కొద్ది రోజుల్లో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రయాణికుల భద్రతకు ఏపీఎస్ఆర్టీసీ ముందు ఉంటుందని అన్నారు. కష్ట నష్టాలు ఉన్న ఏపీఎస్ఆర్టీసీ నడుస్తూనే ప్రజలకు సేవ చేస్తూ ఉంటుందని వివరించారు. జగన్ ప్రభుత్వంలో ఆర్టీసీ భూములు అన్యాక్రాంతం జరిగాయని ఆరోపించారు. ఆక్రమణలకు గురైన ఏపీఎస్ఆర్టీసీ భూములు వెనక్కి తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : MLC Kodandaram : కేటీఆర్ పై ఎమ్మెల్సీ కోదండరాం సంచలన వ్యాఖ్యలు