AP&TG : రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ప్రాథమిక ధర (బేసిక్ ప్రైస్)ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని బ్రాండ్ల బీర్ల గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లో సుమారు 15% పెరుగుదల కనిపించనుంది.
AP&TG Liquor Price Hikes
విశ్వసనీయ సమాచారం ప్రకారం, లైట్ బీరు ధర రూ.150 నుంచి రూ.180కి, స్ట్రాంగ్ బీరు ధర రూ.160 నుంచి రూ.190కి పెరిగే అవకాశముంది. రౌండింగ్ ఆఫ్ విధానాన్ని అనుసరించే ప్రభుత్వ ధోరణి కారణంగా ఖచ్చితమైన పెంపు వివరాలు నేడు స్పష్టతకు వస్తాయి. నేటి నుంచి వైన్ షాపులు, బార్ & రెస్టారెంట్లకు డిపోల్లో చేరే కొత్త స్టాక్ కొత్త ధరలకు విక్రయించబడుతుంది. అయితే, సోమవారం నాటికి డిపోల నుంచి పంపిణీ చేసిన బీర్లను పాత రేటుకే అమ్మాల్సి ఉంటుంది.
బేసిక్ ధర పెంపు, బకాయిల చెల్లింపుల విషయంలో గతంలో బీర్ల తయారీ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ బ్రాండ్ కొంతకాలం సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫారసుల మేరకు ఎట్టకేలకు ప్రాథమిక ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో మద్యం వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానుండగా, వినియోగదారులు ముందు రోజుల్లో బీర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే అవకాశముంది.
ఇక ఏపీ(AP) సర్కార్ సైతం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.99 లిక్కర్, బీరు మినహా అన్ని కేటగిరీల్లో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా లిక్కర్ రేటు బాటిల్‌పై రూ.10 మాత్రమే పెరిగిందని ఏపీ(AP) ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు. బ్రాండ్, సైజ్‌తో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 మాత్రమే పెంచినట్లు వెల్లడించారు. రూ.99 లిక్కర్, బీరు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదన్నారు. ధరలను మద్యం షాపులన్నీ డిస్ ప్లే చేయాలని సూచించారు.
Also Read : Minister Payyavula : మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థికమంత్రి కీలక సమావేశం