AR Rahaman : తీయ‌నైన భాష త‌మిళం – రెహ‌మాన్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన అల్లా ర‌ఖా

AR Rahaman : దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు అల్లా ర‌ఖా రెహ‌మాన్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ భాష అద్భుత‌మ‌ని, తీయ‌నైన‌ద‌ని పేర్కొన్నారు.

ఇటీవ‌ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లీష్ భాష‌కు బ‌దులు హిందీ భాష‌ను విధిగా వాడాలంటూ పేర్కొన‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది.

ఈ త‌రుణంలో త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖ క‌వి భార‌తీదాసన్ రాసిన ఫంక్తుల‌ను ఉద‌హ‌రించారు. త‌మిళ భాష మ‌న‌కు మూలం అని పేర్కొన్నారు. రెహ‌మాన్(AR Rahaman) చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేగింది.

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హిందీ భాషేత‌ర రాష్ట్రాల‌లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. సీఐఐ ఆధ్వ‌ర్యంలో చెన్నై లోని నందంబాక్కంలో సౌత్ ఇండియా మ‌డియా, ఎంట‌ర్ టైన్మెంట్ స‌ద‌స్సు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ (AR Rahaman)ను ఐకాన్ పుర‌స్కారంతో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర స‌మ‌చార , ప్ర‌సార శాఖ మంత్రి ఎల్. మురుగ‌న్ , పెప్సీ, త‌మిళ‌నాడు సినీ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ఆర్కే సెల్వ‌మ‌ణి, ద‌క్షిణ భార‌త న‌టీ న‌టుల సంఘం చీఫ్ నాజ‌ర్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

ఏఆర్ రెహ‌మాన్ త‌మిళ భాష‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తీయ‌నైన‌ది త‌మిళ భాష అని పేర్కొన్నారు. అమిత్ షా హిందీ భాష‌ను మాత్ర‌మే వాడాల‌ని పేర్కొనడాన్ని త‌ప్పు ప‌ట్టారు.

దీనిపై ఆయ‌న మ‌రోసారి స్పందించారు. త‌మిళం మూలం అదే మాకు ప్రాణం అని స్ప‌ష్టం చేశారు ఏఆర్ రెహ‌మాన్.

Also Read : ర‌ణబీర్ ఆలియా పెళ్లి వాయిదా ?

Leave A Reply

Your Email Id will not be published!