AR Rahaman : అల్లా ర‌ఖా రెహ‌మాన్ పోస్ట్ క‌ల‌క‌లం

హొం శాఖ మంత్రి వ్యాఖ్య‌లు క‌ల్లోలం

AR Rahaman  : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇంగ్లీష్ లో కాకుండా ప్ర‌తి ఒక్క‌రు హిందీలోనే మాట్లాడాల‌ని చేసిన వ్యాఖ్య‌లపై మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికే త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు క‌ర్ణాట‌క మాజీ సీఎంలు సిద్ద‌రామ‌య్య‌, హెచ్ డీ కుమార స్వామి సీరియ‌స్ అయ్యారు. ఇది ఒక ర‌కంగా రాష్ట్రాల‌పై పెత్త‌నం చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు.

దీనిని ఎట్టి ప‌రిస్థితుల్లో తాము ఒప్పుకునేది లేద‌ని స్పష్టం చేశారు. అంతే కాదు తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

తాజాగా భార‌త దేశానికి చెందిన సినీ సంగీత దిగ్గ‌జం అల్లా ర‌ఖా ర‌హ‌మాన్ (ఏఆర్ఆర్ ) స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌మిళ రాష్ట్రానికి సంబంధించిన ఫోటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశారు.

ఇది పూర్తిగా అమిత్ షాకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చార‌ని భావిస్తున్నారు. త‌మిళ దేవ‌త‌గా ఆరాధించే త‌మిళ నాంగు పోస్ట్ చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

అమిత్ షా చేసిన ప్ర‌క‌ట‌న‌పై త‌మిళ రాజ‌కీయ పార్టీల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. ఈ త‌రుణంలో ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, సంగీత‌కారుడు ఏఆర్ ర‌హ‌మాన్(AR Rahaman )ప్రియ‌మైన త‌మిళం అంటూ పోస్ట్ చేయ‌డం ఒక ర‌కంగా అమిత్ షాకు వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

20వ శ‌తాబ్దానికి చెందిన ఆధునిక క‌వి భార‌తీ దాస‌న్ త‌న త‌మిళ‌య‌క్కం అనే త‌మిళ క‌విత‌ల పుస్త‌కం నుంచి రాసిన ఒక పంక్తిని చేర్చారు. ప్రియ‌మైన త‌మిళం మ‌న ఉనికికి మూలం అని అందులో ఉంది.

Also Read : అభిమానుల ఆరాధ్య దైవం ‘త‌ల‌ప‌తి’

Leave A Reply

Your Email Id will not be published!