Argentina VS Croatia : క్రొయేషియా..అర్జెంటీనా నువ్వా నేనా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు రెడీ

Argentina VS Croatia : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ -2022 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. టైటిల్ ఫేవ‌రేట్ గా పేరొందిన పోర్చుగ‌ల్ టోర్నీ నుంచి వైదొలిగింది. మొరాకో చేతిలో ఓటమి పాలైంది. ప్ర‌స్తుతం నాలుగు జ‌ట్లు రెడీ అయ్యాయి. సెమీస్ పోరాటానికి సిద్ద‌మ‌య్యాయి.

ఛాన్స్ కోల్పోయిన స‌మ‌యంలో వ‌ర‌ల్డ్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. మ‌రో వైపు పోటా పోటీగా ఉన్న మెస్సీ ముందంజ వేశాడు. మ‌రో వైపు అర్జెంటీనా తాడో పేడో తేల్చుకునేందుకు సై అంటోంది. ఆ జ‌ట్టు క్రొయేషియాతో(Argentina VS Croatia) పోటీకి సిద్ద‌మైంది.

సాక‌ర్ మాంత్రికుడిగా పేరొందిన డిగో మార‌డోనా ప్రాతినిధ్యం వ‌హించిన అర్జెంటీనాకు ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఎగ‌రేసుకు పోవాల‌ని డిసైడ్ అయ్యాడు మెస్సీ.

మ‌రో వైపు అర్జెంటీనాను మ‌ట్టి క‌రిపించాల‌ని క‌సి మీద ఉంది క్రొయేషియా. ప్ర‌స్తుతం మెస్సీ వ‌ర్సెస్ మోడ్రిచ్ మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ లో మొత్తం 32 జ‌ట్లు పాల్గొన్నాయి. చివ‌రి వ‌ర‌కు నాలుగు జ‌ట్లు సెమీస్ కు చేరుకున్నాయి. లీగ్ ద‌శ నుంచి ప్రీ క్వార్ట‌ర్స్ , క్వార్ట‌ర్స్ పూర్తి కాగా సెమీ ఫైన‌ల్ క‌థ మిగిలింది.

టైటిల్ ఫేవ‌రేట్ గా ఉన్న బ్రెజిల్ , జ‌ర్మ‌నీ, బెల్జియం, స్పెయిన్ , పోర్చుగ‌ల్ , నెద‌ర్లాండ్స్ , ఉరుగ్వే టోర్నీ నుంచి నిష్క్ర‌మించాయి. ఇక అంతిమ పోరులో అర్జెంటీనా, క్రొయేషియా, మొరాకో, ఫ్రాన్స్ మిగిలాయి. ఇవాళ అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల‌కు లుసైల్ స్టేడియంలో సెమీస్ పోరు కొన‌సాగ‌నుంది.

Also Read : ఆడితేనే నిల‌బ‌డ‌తాం లేకపోతే క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!