Arjuna Ranatunga : శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ అర్జున రణతంగా (Arjuna Ranatunga )సంచలన కామెంట్స్ చేశాడు. ఓ వైపు దేశం ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోందని, ప్రజలు రోడ్లపైకి వచ్చారని ఈ సమయంలో ఐపీఎల్ ఆడటం అంత అవసరమా అని ప్రశ్నించాడు.
దేశం పట్ల ఏమాత్రం అభిమానం, గౌరవం ఉన్నా వెంటనే పర్మిషన్ తీసుకుని మాతృభూమి కోసం రావాలని పిలుపునిచ్చాడు. చేసిన అప్పులు తీర్చలేమంటూ చావు కబురు చల్లగా చెప్పాడు శ్రీలంక దేశ ప్రధానమంత్రి మహింద రాజపక్సె.
ప్రజలు ఆకలి కేకలు, ఆర్త నాదాలతో అల్లాడుతున్నారు. తినేందుకు తిండి లేదు. ఆకలి చావులకు గురవుతున్నారు. ఇప్పటికే జనం పెద్ద ఎత్తున ప్రెసిడెంట్ , ప్రధాని ఇళ్లపై దాడులకు దిగారు.
ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు డైరెక్టర్ గా ఉన్న కుమార సంగక్కర, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే తో పాటు శ్రీలంక మాజీ క్రికెట్ ఓపెనర్ రోషన్ మహనామా సైతం శ్రీలంక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఈ పరిస్థితికి, దుస్థితికి పాలకులే కారణమంటూ ఆరోపించారు. మరో వైపు కుమార సంగక్కర భార్య సైతం ప్రజల ఆందోళనలో పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా అర్జున రణతుంగ (Arjuna Ranatunga )ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేయడం దుమారం రేగింది.
దయచేసి దేశం కోసం ఇండియన్ ప్రిమీయర్ లీగ్ వదిలేసి రండి అని కోరాడు. ప్రస్తుతం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలు పూర్తిగా లేకుండా పోయాయని వాపోయాడు. ఇదిలా ఉండగా మాజీ ఆటగాళ్లు ఇంకా స్పందించ లేదు.
Also Read : శివమెత్తిన శివమ్ దూబే