Arjuna Ranatunga : లంకేయుల హృదయాల్లో వార్న్ పదిలం
గాలె స్టేడియంలో క్రికెట్ దిగ్గజానికి నివాళి
Arjuna Ranatunga : ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగిన ఆసిజ్ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ ఇటీవలే గుండె పోటుకు గురై మరణించాడు. చాలా మందికి అతడు క్రికెటర్ గా మాత్రమే తెలుసు.
కానీ అతడిలో దాతృత్వం కూడా దిగి ఉంది. ఇందుకు సంబంధించి శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ మంత్రి అర్జున రణతుంగ (Arjuna Ranatunga) బుధవారం ఆ లెజెండ్ ను గుర్తు చేసుకున్నాడు.
సునామీ కొట్టిన దెబ్బకు శ్రీలంక అతలాకులతమైంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సాయం కోసం ఎదురు చూశారు. 2004లో సంభవించిన ఆనాటి సునామీ సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూశాడు షేన్ వార్న్ .
ఇందు కోసం తన వంతు సాయంగా ఏకంగా భారీ ఎత్తున డబ్బుల్ని అందజేశాడు. ఇప్పటికీ శ్రీలంక ప్రజల హృదయాలో షేన్ వార్న్ నిలిచే ఉన్నాడని పేర్కొన్నాడు అర్జున రణతుంగ. ఇవాళ వార్న్ కు నివాళి అర్పించాడు.
ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ మీడియాతో మాట్లాడాడు. షేన్ వార్న్ అద్భుతమైన ఆటగాడని అందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా సునీమా తర్వాత వార్న్ శ్రీలంక ప్రజల హృదయాలలో నిలిచి పోయాడని, దగ్గరయ్యాడని కొనియాడారు.
సునామీ కారణంగా గాలే ఇంటర్నేషనల్ స్టేడియం ధ్వంసమైంది. దానిని పునర్ నిర్మించేందుకు షేన్ వార్న్ $1 మిలియన్ కంటే ఎక్కువగా సాయం చేశాడని చెప్పారు.
అంతే కాదు 31 వేల మందికి అతడు చేసిన సాయం మరిచి పోలేమన్నాడు. ఇవాళ గాలె స్టేడియంలో వార్న్ కు నివాళులు అర్పించిన వారిలో మాజీ , తాజా క్రికెటర్లు ఉన్నారు.
Also Read : సంజూ శాంసన్ క్రేజ్ అదుర్స్