Chandrababu : బాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లిలో ఏర్పాటు

అధికారులు, టీడీపీ కార్యక్రమ కమిటీ సభ్యులు పనులను పర్యవేక్షిస్తున్నారు....

Chandrababu : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 164 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కోసం తొలుత కేసరపల్లి ప్రాంతాన్ని, మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలోని మరో స్థలాన్ని పరిశీలించారు. అయితే కేసరపల్లి స్థానాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Chandrababu…

అయితే కేసరపల్లిలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు, టీడీపీ కార్యక్రమ కమిటీ సభ్యులు పనులను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ సామగ్రి, వాహనాలు సభాస్థలికి చేరుకున్నాయి. దాదాపు 20 హెక్టార్ల స్థలంలో ప్రమాణస్వీకారానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి అదనపు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు నిన్న(శుక్రవారం) స్థలాన్ని పరిశీలించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ స్థలాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Venkaiah Naidu : అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది – వెంకయ్య నాయుడు

Leave A Reply

Your Email Id will not be published!