Arun Goel CEC : అప్పుడే వీఆర్ఎస్ అంత‌లోనే సీఈసీ ఛాన్స్

అరుణ్ గోయ‌ల్ ఎంపిక‌లో కేంద్రం అత్యుత్సాహం

Arun Goel CEC : దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అరుణ్ గోయ‌ల్ నియామ‌కంపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ప్ర‌ధానంగా ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల నియామ‌కం అస్త‌వ్య‌స్తంగా ఉందంటూ సుప్రీంకోర్టులో ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ సంద‌ర్బంగా ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. సంచ‌ల‌న కామెంట్స్ కూడా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌త్యేకించి గ‌తంలో సీఈసీగా ప‌ని చేసి పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన టీఎన్ శేష‌న్ ను గుర్తు చేసింది.

ప్ర‌ధాన మంత్రిని ప్ర‌శ్నించి, ఎదుర్కొనే ధైర్యం క‌లిగిన సీఈసీ(Arun Goel CEC) కావాల‌ని కానీ ఎస్ బాస్ అన్న వ్య‌క్తి ఉండ కూడ‌దంటూ ప్ర‌శ్నించింది. న‌వంబ‌ర్ 23న విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం తిరిగి 24న కూడా విచార‌ణ చేప‌ట్టింది.

అత్యంత కీల‌క‌మైన ప్ర‌శ్న‌ల‌ను లేవ‌దీసింది. సీజేఐతో పాటు ఇత‌ర ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల నియామ‌కంలో సైతం పార‌ద్శ‌ర‌క‌మైన ఎంపిక కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, కానీ తాజాగా న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం అరుణ్ గోయ‌ల్ ను ఎంపిక చేసిన విధానం స‌రిగా లేదంటూ మండిప‌డింది ధ‌ర్మాసం.

ఇదిలా ఉండ‌గా గోయ‌ల్ కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న‌త స్థాయిలో అధికారిగా ప‌ని చేశారు. విచిత్రం ఏమిటంటే అరుణ్ గోయ‌ల్(Arun Goel CEC) గురువారం వ‌ర‌కు స‌ర్కార్ లో సెక్ర‌టరీ స్థాయి అధికారిగా ఉన్నారు. అక‌స్మాత్తుగా ఆయ‌న‌కు శుక్ర‌వారం వీఆర్ఎస్ ఇచ్చారు.

ఇంత‌లోనే దేశంలోనే అత్యున్న‌త‌మైన పోస్ట్ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నియ‌మించారంటూ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ ప్ర‌స్తావించారు. ఇదంతా ప‌క్క‌న పెడితే స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఎన్నిక‌ల క‌మిష‌న్ కేంద్రం జేబు సంస్థ‌గా మార‌డం దారుణ‌మ‌ని కోర్టు వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌భుత్వానికి పెద్ద దెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

సీనియార్టీ క‌లిగిన ఉన్న‌తాధికారుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటివేవీ పాటించ లేదు కేంద్ర ప్ర‌భుత్వం. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా భార‌త దేశానికి పేరుంది. దీనిని ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఉంటుంది.

పంజాబ్ కేడ‌ర్ కు చెందిన గోయ‌ల్ 37 ఏళ్ల త‌ర్వాత కేంద్ర ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఆయ‌న కంటే అనుభ‌వం క‌లిగిన ఉన్న‌తాధికారులు ఎందరో ఉన్నా గోయ‌ల్ కే ఎందుకు సీఈసీగా ప్ర‌మోట్ చేశార‌నే దానిపై కేంద్ర స‌ర్కార్ చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

ప్ర‌స్తుతం దేశంలోని రెండు ప్ర‌ధాన రాష్ట్రాలు గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇంత ఆద‌రాబాద‌రాగా ఎందుకు ఎంపిక చేశార‌నే దానిపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

దీనీనే సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది..కేంద్రాన్ని నిల‌దీసింది. వ్య‌వ‌స్థ‌లు ఎప్పుడూ స్వేచ్చ‌త‌తో ప‌ని చేయాలి..స‌ర్కార్ల‌కు గులాంలు కాకూడ‌ద‌న్న‌ది తెలుసుకుంటే బెట‌ర్.

Also Read : అరుణ్ గోయ‌ల్ నియామ‌కం ‘సుప్రీం’ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!