Arvind Kejriwal : ఆప్ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల 2100 నగదు
ప్రస్తుతం ఉన్న ఆరు ఉచిత పథకాలు కూడా కొనసాగిస్తామని కేజ్రీవాల్ చెప్పారు...
Arvind Kejriwal : ‘‘కేజ్రీవాల్ కా గ్యారెంటీ’’ పేరుతో రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోను ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సోమవారం విడుదల చేశారు. ‘‘ఆప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అనే నేను నా తల్లులు, సోదరీమణుల కోసం మహిళా సమ్మాన్ రాశి యోజన పథకం ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నాను’’ అని ముద్రించిన గ్యారెంటీ కార్డుపై సంతకం చేశారు. ఆ మ్యానిఫెస్టోలో మహిళలకు నెలానెలా రూ. 2,100 ఆర్థిక సాయం, 24 గంటలూ మంచి నీళ్లు, వృద్ధుల కోసం ఉచిత ఆరోగ్య పథకం, విద్యార్థులకు మెట్రోలో 50 శాతం రాయితీ తదితర 15 ముఖ్యమైన హామీలు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న ఆరు ఉచిత పథకాలు కూడా కొనసాగిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. అర్చకులకు, గురుద్వారా గ్రంథీలకు నెలకు రూ.18 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు, రిక్షావాలాలకు ఆర్థిక సహాయం చేస్తామని, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష ఇస్తామని, రూ.10 లక్షల జీవిత బీమా, రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. ఇప్పటికే తామిస్తున్న పథకాలతో ప్రతి కుటుంబం నెలనెలా రూ.25 వేలు వరకు లబ్ధిపొందుతోందని, ఉచితాలను ఆపేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పినందున ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇదంతా కోల్పోతారని ఆయన హెచ్చరించారు.
Arvind Kejriwal Comment
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చే నీటిలో విషం (అధిక అమ్మోనియా స్థాయి) కలుపుతోందని ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి ఓటేయకుంటే.. వారికి విషం కలిపిన నీరు ఇచ్చి చంపుతారా? అని ప్రశ్నించారు. ‘ఈ కలుషిత నీరు ఇక్కడి తాగు నీటిలో కలిస్తే.. ఎంత మంది ఢిల్లీ ప్రజలు చనిపోయారో చెప్పలేం! ఒక సామూహిక నరమేధం అయ్యేది!!’ అని వ్యాఖ్యానించారు.
Also Read : CM Chandrababu Slams : గత పాలకులు ఏపీని శ్రీలంక స్థితికి తీసుకొచ్చారు