Arvind Kejriwal : ఢిల్లీ ప్రజలకు మరో కీలక హామీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్
గత పదేళ్లుగా మా ప్రభుత్వం ఢిల్లీలో ఉచిత నీటిని అందిస్తోంది...
Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ కేవలం ప్రతికూల విమర్శలు, ఇతరులను అవమానించడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని, ఆప్ మాత్రం పదేళ్లు చేసిన పనుల ఆధారంగా ఓట్లు కోరుతోందని ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ వాసులు తప్పుడు నీటి బిల్లులు వస్తే వాటిని కట్టవద్దని, ఆప్ ప్రభుత్వం 2025లో తిరిగి అధికారంలోకి రాగానే ఆ బిల్లులను రద్దు చేస్తుందని ఆయన మరో కీలక హామీ ఇచ్చారు.
Arvind Kejriwal Comment
”గత పదేళ్లుగా మా ప్రభుత్వం ఢిల్లీలో ఉచిత నీటిని అందిస్తోంది. 12 లక్షలకు పైగా కుటుంబాలకు జీరో వాటర్ బిల్లులు వస్తున్నాయి. అయితే నేను జైలుకు వెళ్లాక ఏమి జరిగిందో నాకు తెలియదు. వాళ్లు ఏదో తప్పు చేశారు. ప్రజలకు వేలు, లక్షల్లో ప్రతినెలా నీటి బిల్లులు వస్తున్నాయి. తప్పుడు బిల్లులు వస్తున్నాయని అనుకుంటున్న వాళ్లు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని నేను బహిరంగంగా, అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఓపికతో వేచిచూడండి. ఎన్నికల తర్వాత ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులన్నింటినీ రద్దు చేస్తుంది. ప్రజలందరికీ ఇది నా హామీ.. ఇందుకు నేను గ్యారెంటీ” అని కేజ్రీవాల్ తెలిపారు.
కాంగ్రెస్పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజావిశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సూచించారు. కాంగ్రెస్ ఊసే ప్రజలు ఎత్తడం లేదన్నారు. ఢిల్లీలో బీజేపీ విపత్తులో ఉందని, ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ, ఎజెండా కానీ, ఒక విజన్ కానీ లేవని విమర్శించారు.
Also Read : Rishab Pant : తన బ్యాటింగ్ తో కంగారు బౌలర్లకు వణుకు పుట్టించిన రిషబ్ పంత్