Arvind Kejriwal Slams : బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోతో ఢిల్లీకే కాదు దేశానికే ముప్పు

బీజేపీకి అధికారం ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను సైతం నిలిపివేస్తారని అన్నారు...

Arvind Kejriwal : అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రెండు విడతలుగా విడుదల చేసిన సంకల్ప్ పాత్ర ఇటు ఢిల్లీకి, అటు దేశానికి ప్రమాదకరమని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హెచ్చరించారు. తాము ఉచిత విద్యను అందిస్తుంటే వాళ్లు అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత విద్యను నిలిపివేస్తారని అన్నారు. నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన తొలి సంకల్ప పాత్రలో మొహల్లా క్లినిక్‌లు ఆపేస్తామని ప్రకటించారని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ(BJP)కి అధికారం ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను సైతం నిలిపివేస్తారని అన్నారు.

Arvind Kejriwal Slams..

”ఇవాళ విడుదల చేసిన సంకల్ప్ పాత్రలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను ఆపేస్తామని చెప్పారు. అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఉచిత విద్య ఇస్తామంటున్నారు. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. ఆ పార్టీకి ఓటు వేస్తే మీ బడ్జెట్ తలకిందులవుతుంది. ఇక ఢిల్లీలో మీరు జీవనం సాగించలేరు” అని ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ హెచ్చరిక చేశారు. తాము 18 లక్షల మంది పేద విద్యార్థులకు ఢిల్లీలో ఉచిత విద్య అందిస్తున్నామని, బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్య సహాయం, ఉచిత విద్యుత్ నిలిపివేస్తారని అన్నారు.

ఢిల్లీఅసెంబ్లీ ఎన్నికల కోసం ‘సంకల్ప్ పాత్ర-2’ను బీజేపీ లోక్‌సభ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడు విడుదల చేశారు. ప్రభుత్వ సంస్థల్లో విద్యార్థులకు ఇచిత విద్య, ఆటోరిక్షా డ్రైవర్లు, డొమెస్టిక్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, బీమా పథకం, ఆప్ హయాంలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటుకు మేనిఫెస్టో వాగ్దానం చేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి. ఢిల్లీలో 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆప్ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020 ఎన్నికల్లో 62 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది.

Also Read : CM Revanth Tour : దావోస్ లో ‘యునిలివర్’ సంస్థతో సర్కార్ చర్చలు విజయవంతం

Leave A Reply

Your Email Id will not be published!