Arvind Kejriwal : ఆప్ ఎమ్మెల్యేలను చాయ్ మీటింగ్ కు పిలిచిన కేజ్రీవాల్

2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ అద్భుత విజయం సాధించింది...

Arvind Kejriwal : ఢిల్లీ ఫలితాల ప్రభావం పంజాబ్‌ రాజకీయాల్లో కనపడుతుందా? అని అడిగితే నిపుణులు అవును అంటున్నారు. మంగళవారం, ఆప్‌ జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) పంజాబ్‌ ఆప్‌ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు 30 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు తమతో సంబంధం పెట్టుకున్నట్లు చెప్తున్నారు. దీని పై వెంటనే ఆమ్‌ఆద్మీ పక్షం స్పందించింది. మంగళవారం కేజ్రీవాల్‌ ఎమ్మెల్యేలను చాయ్‌ మీటింగ్‌కు ఆహ్వానించారు. పంజాబ్‌ అసెంబ్లీ 117 సీట్లతో కూడిన ఈ ఎన్నికల్లో ఆప్‌ 93 సీట్లతో విజయాన్ని సాధించింది. అయితే, ఎమ్మెల్యేల్లో చీలిక భావనతో కేజ్రీవాల్‌కు కొంత మంటలు మొదలయ్యాయి.

Arvind Kejriwal Meet

2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ అద్భుత విజయం సాధించింది. 117 సీట్లలో ఆప్‌ 93 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా 16 సీట్లు గెలిచింది. బీజేపీకి 2 సీట్లు, అకాలీదళ్‌కు 3 సీట్లు దక్కాయి. ప్రస్తుతం, ఆప్‌ ఎమ్మెల్యేల్లో చీలిక తలెత్తిందనే ప్రచారం ఉధృతమైంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో పంజాబీ ఓటర్లు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్న 28 సీట్లలో 23 సీట్లలో బీజేపీ విజయం సాధించింది. ఈ పరిణామాలే ప్రస్తుతం ఆప్‌కు సమస్యలను తీసుకొస్తున్నాయి.

ఇప్పుడు, తాజా పరిణామాలతో పంజాబ్‌లో ఆప్‌ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని కనిపిస్తోంది. కేజ్రీవాల్‌ చాయ్‌ మీటింగ్‌లతో ఎమ్మెల్యేల్లో చీలికను నివారించగలిగితే, పంజాబ్‌ ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించగలిగితే, పంజాబ్‌ రాజకీయాలు ఎలా మలుపు తీసుకుంటాయో చూడాలి.

Also Read : Minister Komatireddy : మహాకుంభ లో స్నానం ఆచరించిన తెలంగాణ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!