సర్వాధికారాలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటాయని కేంద్రానికి సంబంధించి కేవలం శాంతి భద్రతలు, భూ వ్యవహారాలు మాత్రమే వర్తిస్తాయంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. గత కొన్నేళ్లుగా కోర్టులో కేంద్రం వర్సెస్ ఢిల్లీ ఆప్ సర్కార్ మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఎవరికి అధికారాలు ఉంటాయనే దానిపై పూర్తి స్పష్టత ఇచ్చింది సుప్రీంకోర్టు.
ప్రజాస్వామ్యం మరింత బలపడేలా తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక నుంచి ఎల్జీ ఆధిపత్యం అన్నది ఉండబోదంటూ స్పష్టం చేశారు. ఇక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఈ తీర్పు ఓ చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం.
ఇక నుంచి మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని పేర్కొన్నారు. చివరకు ధర్మమే గెలిచిందన్నారు సీఎం. మంత్రి మండలి సలహా మరకు లెఫ్టినెంట్ గవర్నర్ విధులు నిర్వహించాలని తన తీర్పులో స్పష్టం చేసింది.
అంతే కాకుండా సివిల్ సర్వెంట్లు తటస్థంగా వ్యవహరించాలని పేర్కొంది సుప్రీంకోర్టు. తాజా తీర్పుతో ఆప్ శిబిరంలో ఉత్సాహం పెల్లుబికింది. ఇక నుంచి అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపింది. సీఎం సుప్రీం అని ఎల్జీ నామమాత్రమేనని కుండ బద్దలు కొట్టింది.
