Arvind Kejriwal : రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడండి

ప‌న్నుల మోత‌లో ఆంగ్లేయుల‌ను దాటేశారు

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) షాకింగ్ కామెంట్స్ చేశారు. గుజ‌రాత్ లో బీజేపీ ప్ర‌భుత్వం రాచ‌రిక పాల‌న సాగిస్తోంద‌ని దీనికి చ‌ర‌మ‌గీతం పాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. త్వ‌ర‌లో గుజ‌రాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక్క‌డ కొలువు తీరిన బీజేపీ, కాంగ్రెస్ , ఆప్ మ‌ధ్య పోటీ హోరా హోరీగా కొన‌సాగ‌నుంది. అయితే అర‌వింద్ కేజ్రీవాల్ , మోదీ, అమిత్ షా పెద్ద ఎత్తున ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. గ‌తంలో దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల రాచ‌రిక పాల‌న కంటే మోదీ నేతృత్వంలోని బీజేపీ పాల‌న దారుణంగా ఉంద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

విచిత్రం ఏమిటంటే సామాన్య ప్ర‌జ‌లు నిత్యం ఆహార రూప‌కంగా తీసుకునే ప్యాకేజ్డ్ ప‌రాటాపై ఏకంగా 18 శాతం జీఎస్టీ విధించార‌ని ఇలాంటి స‌న్నివేశం ఆనాటి ఆంగ్లేయులు కూడా ప‌న్ను విధించ లేదంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్ల‌ను ఎన్నుకుంటే మ‌నిషిపై కూడా జీఎస్టీ విధిస్తారంటూ హెచ్చ‌రించారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగేందుకు ప్ర‌ధాన కార‌ణం జీఎస్టీ అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం. ప‌రాటాలు లేదా చ‌పాతీలు లేదా రొట్టెలను పేద‌లే ఎక్కువ‌గా వాడ‌తార‌ని వారిని వాటికి దూరంగా ఉంచేలా కేంద్ర స‌ర్కార్ జీఎస్టీ విధించి దూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఆరోపించారు కేజ్రీవాల్.

ఇదిలా ఉండ‌గా ప‌లు రాష్ట్రాలు ప‌రాటాపై 18 శాతం జీఎస్టీ విధించడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాయి. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ఏనాడూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న పాపాన పోలేద‌న్నారు.

Also Read : మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు మ‌నీష్ తివారీ మ‌ద్ద‌తు

Leave A Reply

Your Email Id will not be published!