Asaduddin Owaisi: వక్ఫ్‌ బిల్లుపై ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ అసదుద్దీన్‌ ఓవైసీ

వక్ఫ్‌ బిల్లుపై ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ అసదుద్దీన్‌ ఓవైసీ

Asaduddin Owaisi : వక్ఫ్‌ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలనడం సబబా అని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. వక్ఫ్‌(సవరణ)చట్టం–2025పై అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ పై వచ్చే వారం సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వక్ఫ్‌ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలనడం సబబా. కొత్త చట్టంతో కబ్జా చేసిన వాళ్లే యజమానులుగా మారుతారు. చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 19న హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ తెచ్చిన వక్ఫ్‌ చట్టసవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు,నితీష్‌ సహకారంతోనే నల్ల చట్టం తెచ్చారు’ అని వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi Meeting

వక్ఫ్‌(సవరణ)చట్టం–2025 అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుండగా… ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథ్‌ ఉంటారని సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ పేర్కొంది.

Also Read : Honor Suicide: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ! మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య !

Leave A Reply

Your Email Id will not be published!