Asaduddin Owaisi : బీఆర్ఎస్ హ్యాట్రిక్ ప‌క్కా – ఓవైసీ

కాంగ్రెస్ పార్టీది బ‌లుపు కాదు వాపు

Asaduddin Owaisi : హైద‌రాబాద్ – ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముచ్చ‌ట‌గా మూడోసారి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Asaduddin Owaisi Comment

119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో బీఆర్ఎస్ కు ప‌క్కా 100 సీట్లు వ‌స్తాయ‌ని రాసి పెట్టుకోవాల‌ని అన్నారు. తాము ఈసారి 9 నియోజ‌క‌వ‌ర్గాల‌లో బ‌రిలో ఉన్నామ‌ని , అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎంఐఎం అభ్య‌ర్థులు గెల‌వ‌డం ప‌క్కా అని స్ప‌ష్టం చేశారు ఓవైసీ.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తామ‌ని ఎక్కువ‌గా ఊహించు కుంటోంద‌ని ఆ పార్టీకి అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు , కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నార‌ని అన్నారు.

ఈ ప‌దేళ్ల కాలంలో పాత బ‌స్తీకి భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు ద‌క్కింద‌న్నారు అస‌దుద్దీన్ ఓవైసీ. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయ‌ర‌ని పేర్కొన్నారు. ముస్లిం సామాజిక వ‌ర్గం గంప‌గుత్త‌గా త‌మ‌కు మాత్ర‌మే వేస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : CM KCR : కాంగ్రెసోళ్లు ద‌ద్ద‌మ్మ‌లు – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!