Asha Bhosle : ఆషా స్వ‌ర మాధుర్యం ల‌త‌కు అంకితం

ల‌తా దీనానాథ్ మంగేష్క‌ర్ అవార్డు ఉత్స‌వం

Asha Bhosle : భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గిన దిగ్గ‌జ గాయ‌కురాలు దివంగ‌త ల‌తా మంగేష్క‌ర్. లోకంలో సూర్య‌చంద్రులు ఉన్నంత కాలం ఆమె బ‌తికే ఉంటారు. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఆమె అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంత‌కంటే గౌర‌వం కూడా.

ఆమె పాడిన పాట‌లంటే ప్ర‌ధానికి ఇష్టం. అందుకే మ‌ర‌ణించిన స‌మ‌యంలో చివ‌రి వ‌ర‌కు ఉండి వీడ్కోలు ప‌లికిన గొప్ప వ్య‌క్తి.

దేశానికి అత్యున్న‌త స్థానంలో ఉన్నా అన్నింటిని ప‌క్క‌న పెట్టి అంత్య్ర‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

ఈ ర‌కంగా త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఒకానొక ద‌శ‌లో తాను నోరారా పిలిచే దీదీ లేక పోవ‌డం వెలితిగా ఉందంటూ వాపోయాడు మోదీ.

ల‌తా మ‌ర‌ణాంత‌రం ఆమె కుటుంబీకులు ల‌తా దీనానాథ్ మంగేష్క‌ర్ పేరుతో అవార్డును ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా స‌మాజానికి, దేశానికి నిస్వార్థంగా సేవ చేసినందుకు దీనిని అంద‌జేస్తారు. దీనిని మొద‌ట‌గా అందుకున్నారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.

ఈ సంద‌ర్భంగా చెల్లెలు, ప్ర‌ముఖ గాయ‌ని ఆషా భోంస్లే(Asha Bhosle) త‌న సోద‌రి ల‌తా మంగేష్క‌ర్ పాడిన పాట‌ల‌ను వినిపించారు. ఆమెకు స్వ‌ర నివాళి అర్పించారు.

ల‌తా పాడిన అద్భుత‌మైన పాట‌ల‌లో ఒక‌టైన ఆయేగా ఆనే వాలా ట్యూన్ ను వినిపించారు. ఈ సంద‌ర్భంగా మోదీ భావోద్వేగంతో ల‌తా మంగేష్క‌ర్ అవార్డును జాతికి అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దేశ నిర్మాణంలో అంత‌ర్భాగ‌మైన క‌ళాకార‌ణిగా ఆమెను పేర్కొన్నారు. ల‌తా దీదీ రాగ రాణిగానే కాదు నాకు అక్క‌. త‌ర‌త‌రాల‌కు ప్రేమ‌, క‌రుణ అనే భాష నేర్పింద‌న్నారు మోదీ.

Also Read : కియారా , సిద్ధార్థ్ మల్హోత్రా విడిపోయారా?

Leave A Reply

Your Email Id will not be published!