Ashish Nehra : పాండ్యాను ఆరో బౌల‌ర్ గా వాడుకోవాలి

ఒత్తిడి లేకుండా ఆడిస్తే బెట‌ర్ - నెహ్రా

Ashish Nehra : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ బౌల‌ర్ , గుజ‌రాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా(Ashish Nehra) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు . గుజ‌రాత్ కు క‌ప్ తీసుకు రావ‌డ‌మే కాకుండా సుదీర్గ గ్యాప్ త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చిన హార్దిక్ పాండ్యా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

హార్దిక్ ను నాలుగో బౌల‌ర్ గా కాకుండా ఆరో బౌల‌ర్ గా వాడు కోవాల‌ని సూచించాడు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కు. ఆట అన్నాక తీవ్ర‌మైన

ఒత్తిడి ఉంటుంద‌న్నాడు.

కానీ ఐపీఎల్ లో అన్ని ఒత్తిళ్ల‌ను అధిగ‌మించి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో హార్దిక్ పాండ్యా ఆక‌ట్టుకున్నాడ‌ని కితాబు ఇచ్చాడు ఆశిష్ నెహ్రా.

ద‌క్షిణాఫ్రికా సీరీస్ తో ఆడ‌నున్నాడు పాండ్యా. హార్దిక్ తో పాటు స్టార్ వికెట్ కీప‌ర్ , బ్యాట‌ర్ దినేష్ కార్తీక్ , యుజ్వేంద్ర చాహ‌ల్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చారు. తుది జ‌ట్టులో ఎవ‌రు ఉంటార‌నేది ఇంకా చెప్ప‌లేం.

విశ్రాంతి పేరుతో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్ ప్రీత్ బుమ్రాను ప‌క్క‌న పెట్టారు బీసీసీఐ సెలెక్ట‌ర్లు. తాజాగా కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు

నెట్స్ లో గాయం కావ‌డంతో సౌతాఫ్రికాతో స్వ‌దేశంలో జ‌రిగే 5 మ్యాచ్ ల టి20 సీరీస్ కు దూర‌మ‌య్యాడు.

దీంతో బీసీసీఐ స్టాండ్ బై కెప్టెన్ గా ఢిల్లీకి చెందిన రిష‌బ్ పంత్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో మొత్తం యువ ఆటగాళ్ల‌తో నిండి పోయింది. మ‌రో వైపు త్వ‌ర‌లో ఆస్ట్రేలియాలో వ‌ర‌ల్డ్ క‌ప్ టీ20 జ‌ర‌గ‌నుంది.

ఈసారి యువ‌కులు, సీనియ‌ర్ల‌ను ఎంపిక చాన్స్ ఉంది. ఎవ‌రికైనా చాన్స్ ద‌క్కించు కోవాలంటే స‌ఫారీతో జ‌రిగే సీరీస్ కీల‌కం కానుంది. ఇదిలా

ఉండ‌గా మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి ఇవాళ సంచ‌లన కామెంట్స్ చేశాడు.

వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఎంపిక చేసే జ‌ట్టులో స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ ఉండాల‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు.

Also Read : టీమిండియాకు శాంస‌న్ అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!