Ashish Nehra & Pandya : ఆశిష్ నెహ్రా క‌నిపించ‌ని విజేత

గుజ‌రాత్ విజ‌యం వెనుక అత‌డు

Ashish Nehra & Pandya : ఐపీఎల్ 2022 విజేత‌గా నిలిచింది గుజ‌రాత్ టైటాన్స్ . టైటిల్ గెలుపొందిన అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉద్వేగ భ‌రితంగా మాట్లాడాడు. పేరు పేరునా గుర్తు చేసుకున్నాడు.

ఈ త‌రుణంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ధాన కోచ్ , మాజీ క్రికెట‌ర్ ఆశిష్ నెహ్రా(Ashish Nehra & Pandya) గురించి. ఆయ‌న లేక పోతే తాము ఈ విజ‌యం అందుకోలేక పోయి ఉండేవాడిమ‌ని చెప్పాడు.

మిగ‌తా కోచ్ లు వేరు. గుజ‌రాత్ కోచ్ వేరు. జ‌ట్టు కోచ్ గా మేనేజ్ మెంట్ నియ‌మించిన‌ప్ప‌టి నుంచి జ‌ట్టును దుర్బేద్యంగా తీర్చిదిద్దాడు. శారీర‌కంగా, మాన‌సికంగా ఆట‌కు సంసిద్దుల్ని చేశాడు.

దేశ‌, విదేశీ ఆట‌గాళ్ల‌ను స‌మ‌న్వ‌యం చేయడ‌మే కాదు వారికి దిశా నిర్దేశం చేశాడు. ఎక్క‌డ పొర‌పాట్లు చేశామో తెలిసేలా చేయ‌డమే కాదు ఎక్క‌డా త‌గ్గేదే లేదంటూ ఉండేలా తీర్చి దిద్ద‌డంలో హెడ్ కోచ్ ఆశిష్(Ashish Nehra & Pandya) పాత్ర విస్మ‌రించ లేనిది.

అంద‌రూ గుజ‌రాత్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం తాము నేల‌మీదే ఉన్నామ‌ని చెప్పాడు. అంతే కాదు కోచ్ క‌నిపించ‌ని విజేత అంటూ పేర్కొన్నాడు.

ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సింది నెహ్రా గురించి. ఏమిటంటే జ‌ట్టులోని ప్ర‌తి ఆట‌గాడిని మ్యాచ్ విన్న‌ర్ గా మార్చేశాడు. అదే ఆ జ‌ట్టుకు బ‌లంగా మారింది. ఆ జ‌ట్టును ఐపీఎల్ జ‌గ‌జ్జేత‌గా నిలిచేలా చేసింది.

ఇదే స‌మ‌యంలో ఓవ‌ర్సీస్ స్టార్లు మాథ్యూ వేడ్ , డేవిడ్ మిల్ల‌ర్ జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. ఈ సంద‌ర్భంగా కోచ్ నెహ్రాను ఆకాశానికి ఎత్తేశారు.

పాండ్యా జ‌ట్టును ముందుండి న‌డిపిస్తే ప్ర‌ధాన కోచ్ మాత్రం ప్ర‌తి ఒక్క‌రికీ స్వాగ‌తం ప‌లికేలా చేసి..స్పూర్తి నింపాడంటూ కితాబు ఇచ్చారు.

Also Read : పాండ్యా భార్య‌ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!