Ashish Nehra : ఐపీఎల్ 2022లో వచ్చీ రావడంతోనే గుజరాత్ టైటాన్స్ దూసుకు పోతోంది. తలపండిన టాప్ జట్లకు కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తోంది. ప్రతి జట్టు విజయం వెనుక హెడ్ కోచ్ తప్పనిసరిగా ఉండడం ఖాయం.
మరి గుజరాత్ సాధిస్తున్న సక్సెస్ వెనుక ఉన్నది మాత్రం భారత జట్టు మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra) అంటే నమ్మగలమా. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం మొదటి నుంచీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎవరూ ఊహించని రీతిలో గాయాల పాలై , ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్న హార్దిక్ పాండ్యాకు నాయకత్వ పగ్గాలు అప్పగించింది. తాజా, మాజీ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ సైతం విస్తు పోయారు.
ఏం గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఆ జట్టు బరిలోకి దిగాక గానీ తెలియలేదు. ఎంత సమర్థవంతంగా ఆడుతుందో. జట్టుకు సంబంధించి ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంలో హెడ్ కోచ్ పాత్ర విస్మరించ లేనిది.
ఇప్పుడు ఐపీఎల్ లో అందరి చూపు గుజరాత్ టైటాన్స్ వైపు ఉందంటే హెడ్ కోచే కారణం. జట్టుకు పాండ్యా సారథి అయితే ఆశిష్ నెహ్రా(Ashish Nehra) రథసారథి కావడం విశేషం. జట్టు బ్యాటింగ్ లో, ఫీల్డింగ్ లో , బౌలింగ్ లో దుమ్ము రేపుతోంది.
ప్రధానంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించింది. ఫినిషర్ డేవిడ్ మిల్లర్, అవసరమైన సమయంలో మ్యాచ్ లు మలుపు తిప్పే రషీ ఖాన్ ను తీసుకుంది.
శుభ్ మన్ గిల్ ను కూడా చేజిక్కించుకుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు అభేద్యమైన ఆట తీరుతో సత్తా చాటుతూ దూసుకు పోతోంది గుజరాత్ టైటాన్స్.
Also Read : గుజరాత్ సెన్సేషన్ చెన్నై పరేషాన్