Ashish Nehra Samson : బీసీసీఐపై నిప్పులు చెరిగిన నెహ్రా

సంజూ శాంస‌న్ ను త‌ప్పించ‌డంపై ఫైర్

Ashish Nehra Samson : భారత క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ , గుజ‌రాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా(Ashish Nehra) షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ప‌ట్ల అనుస‌రిస్తున్న విధానాన్ని త‌ప్పు ప‌ట్టాడు. ప్ర‌ధానంగా న్యూజిలాండ్ టూర్ లో మొద‌టి వ‌న్డేలో అద్భుతంగా ఆడినా ఎందుక‌ని రెండో వ‌న్డేలో ఎంపిక చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో ఉన్నాడు.

కానీ ఇప్పుడు ఎక్క‌డా అత‌డి స్థానం త‌ప్ప‌నిస‌రిగా ఉండ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త కొన్ని మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా రిష‌బ్ పంత్ విఫ‌లం అవుతూ వస్తున్నా ఎందుక‌ని రాణిస్తున్న సంజూ శాంస‌న్(Sanju Samson) ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఒక ర‌కంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మొత్తం ఎంపిక వ్య‌వ‌హారాన్ని జోక్ గా అభివ‌ర్ణించాడు.

త‌న‌కే అర్థం కాలేద‌న్నాడు ఆశిష్ నెహ్రా. ఎందుకు ఎంపిక చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌కు బీసీసీఐ వ‌ద్ద కానీ దానిని నియంత్రిస్తున్న వ్య‌క్తుల వ‌ద్ద లేద‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు. ఇప్ప‌టికైనా పున‌రాలోచించు కోవాల‌ని, ఎంపిక చేసే స‌మ‌యంలో క‌నీసం ఒక ప్లేయ‌ర్ ను ఎంపిక చేసే టప్పుడు 10 లేదా 15 మ్యాచ్ ల‌లో ఆడేలా ఉండాల‌ని సూచించాడు.

రెండో వ‌న్డేలో కెప్టెన్ ధావ‌న్, కోచ్ ల‌క్ష్మ‌ణ్ లు దీప‌క్ హూడా, దీప‌క్ చాహ‌ర్ ల‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇక రెండో వ‌న్డే భారీ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ను ర‌ద్దు చేశారు అంపైర్లు. దీంతో మొద‌టి వ‌న్డే ను కీవీస్ గెలుపొందింది. రిష‌బ్ పంత్ కంటిన్యూగా విఫ‌లం అవుతూనే ఉన్నా ఎందుక‌ని మ్యాచ్ ల‌లో ఆడిస్తున్నారంటూ బీసీసీఐని నిల‌దీశాడు ఆశిష్ నెహ్రా(Ashish Nehra).

Also Read : భార‌త్..కీవీస్ రెండో వ‌న్డే వ‌ర్షార్ఫ‌ణం

Leave A Reply

Your Email Id will not be published!