Shane Warne : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ సంచలన కామెంట్స్ చేశాడు. సామాన్యంగా ఎవరినీ ప్రశంసించని ఈ దిగ్గజ ఆటగాడు భారత్ కు చెందిన స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
తమ కాలంలో తాను మురళీధరన్ మధ్య పోటీ ఉండేదని ఇప్పుడు 1000 వికెట్లు పడగొట్టే సత్తా అశ్విన్ కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా వీరిద్దరూ స్పిన్నర్ల పరంగా చూస్తే టాప్ లో ఉన్నారు.
ఒకరు 709 వికెట్లతో టాప్ లో ఉండగా మరొకరు 800 వికెట్ల సరసన ఉన్నారు. జిమ్మీ అండర్సన్ 640 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి కెరీర్ చివరి దశలో ఉంది. ఇక స్టువర్ట్ బ్రాడ్ చాలా వెనుకబడి ఉన్నాడు.
టాప్ 15లో ఇద్దరు చురుకైన స్పిన్నర్లు ఉన్నారు. వారిలో అశ్విన్ , నాథన్ లియోన్ అని పేర్కొన్నాడు షేన్ వార్న్. వీరిద్దరిలో ఒకరు 430 వికెట్లతో మరొకరు 415 తో ఉన్నారు.
ఇద్దరూ 30 ఏళ్ల మధ్యలో ఉన్నప్పటికీ వీరిద్దరికీ షేన్ వార్న్ , ముత్తయ్య మురళీధరన్ లు సాధించిన వికెట్లను ఛేజ్ చేసే చాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ తరుణంలో రవిచంద్రన్ అశ్విన్ కు భవిష్యత్తులో మంచి అవకాశలు లభించినట్లయితే అతను తాము సాధించిన వికెట్ల రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు షేన్ వార్న్(Shane Warne).
ఇక అశ్విన్ తో పాటు లియోన్ కూడా దగ్గరలో ఉన్నాడని అతడికి కూడా ఈ బ్రేక్ చేసే చాన్స్ రావచ్చన్నాడు.
Also Read : అవకాశాలు సరిగా వాడుకోలేదు