Asia Cup 2022 : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఆసియా కప్ (Asia Cup 2022 )ఈసారి శ్రీలంకలో జరగనుంది. 2018లో ఆసియా కప్ చేపట్టారు. మరో రెండేళ్లకు గాను 2020లో నిర్వహించాల్సి ఉండగా కరోనా దెబ్బకు 2020న నిర్వహించాల్సిన టోర్నీని రద్దు చేశారు.
తాజాగా ఆసియా కప్ తిరిగి నాలుగేళ్ల తర్వాత 2022 సంవత్సరానికి గాను ఆసియా కప్ (Asia Cup 2022 )ఆగష్టు 27 నుంచి నిర్వహిస్తారు. అయితే టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ లీగ్ టోర్నీ ఆగష్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య జరగనుంది.
ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇవాళ ప్రకటించింది. టోర్నమెంట్ మొత్తం టీ 20 ఫార్మాట్ లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన క్వాలిఫైర్ లు ఆగష్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉండగా వరల్డ్ క్రికెట్ లో ఆసియా ఖండానికి సంబంధించి ఆసియా కప్ టోర్నీని నిర్వహిస్తూ వస్తున్నారు. 1984లో ఈ టోర్నీ ప్రారంభమైంది. కాగా ఆసియా కప్ చరిత్రలో భారట క్రికెట్ జట్టు అత్యంత విజయవంతమైన టీమ్ గా చరిత్ర సృష్టించింది.
గత రెండు ఎడిషన్ లతో సహా 1984, 1988, 1990-91, 1993, 2010, 2014, 2016, 2018 సంవత్సరాలలో నిర్వహించిన టోర్నీలో మొత్తం ఏడుసార్లు భారత క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది.
దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆసియా కప్ నిర్వహణకు శ్రీలంక బోర్డు సిద్దమైంది.
ప్రస్తుతం ఈనెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అది పూర్తయ్యాక ఆసియా కప్ స్టార్ట్ అవుతుంది. క్రికెట్ ప్రేమికులకు ఒక రకంగా ఇది పండగేనని చెప్పక తప్పదు.
Also Read : యుద్దానికి సిద్దం విజయం ఖాయం