Asia Cup 2023 India Squad : ఆసియా కప్ భారత జట్టు డిక్లేర్
వెల్లడించిన బీసీసీఐ చైర్మన్
Asia Cup 2023 India Squad : ఈ ఏడాదిలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ 2023కి సంబంధించి బీసీసీఐ(BCCI) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. ఆయన కోచ్ ద్రవిడ్ , కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చర్చించారు ఎంపిక చేసే ముందు. మొత్తం టోర్నీలో పాల్గొనే జట్టును ఎంపిక చేశారు. ఇందులో మొత్తం 17 మంది సభ్యులు ఉన్నారు.
Asia Cup 2023 India Squad Announced
ఇక ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా కు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా వైఎస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగుతారు. గాయం కారణంగా ఆటకు దూరమైన కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. దీంతో సంజూ శాంసన్ ను బ్యాకప్ ప్లేయర్ గా ఎంపిక చేశారు.
జట్టు పరంగా చూస్తే ఇలా ఉంది. రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ , కేఎల్ రాహుల్ , సూర్య యాదవ్ , తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , శార్దూల్ ఠాకూర్ , బుమ్రా, షమీ, సిరాజ్ , కులదీప్ యాదవ్ , ప్రసిద్ద్ కృష్ణ, సంజూ శాంసన్ (బ్యాకప్ )
ఇదిలా ఉండగా ఆసియా కప్ లో ఆరు జట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది ఈ టోర్నీ. గత ఏడాది జరిగిన టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది.
Also Read : CM KCR Warning : గీత దాటితే వేటు తప్పదు – కేసీఆర్