Asian Games 2023 : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ హవా

83కి చేరిన ప‌త‌కాల సంఖ్య

Asian Games 2023 : ఆసియా క్రీడ‌ల్లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటుతున్నారు. మొత్తం ప‌త‌కాల సంఖ్య ఏకంగా 83కి చేరింది. గ‌తంలో కంటే ఈసారి భారీగా పత‌కాలు ద‌క్క‌డం విశేషం. తాజాగా స్క్వాష్‌లో భార‌త్ కు బంగారు ప‌త‌కం ల‌భించింది.

Asian Games 2023 Updates

మిక్స్ డ్ డ‌బుల్స్ లో దీపిక‌, హ‌రీంద‌ర్ జోడీకి గోల్డ్ మెడ‌ల్స్ ల‌భించాయి. ఇదిలా ఉండ‌గా ఈ మ్యాచ్ లో మ‌లేషియాపై విజ‌యం సాధించింది భార‌త్. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్కిన ప‌త‌కాల ప‌రంగా చూస్తే ఇండియాకు సంబంధించి 20 బంగారు ప‌త‌కాలు, 31 ర‌జ‌తం, 32 కాంస్య ప‌త‌కాలు ల‌భించాయి.

ఆసియా క్రీడల్లో(Asian Games 2023) అసాధార‌ణ‌మైన రీతిలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చి ప‌త‌కాల‌ను సాధించిన క్రీడాకారుల‌కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దాస్ మోదీ. ఆయ‌న‌తో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

మ‌రిన్ని ప‌త‌కాలు భార‌త్ కు ల‌భిస్తాయ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన మంత్రి. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వివిధ విభాగాల‌లో విజేత‌లుగా నిలిచిన క్రీడాకారులంద‌రికీ పేరు పేరునా అభినంద‌న‌లు తెలిపారు మోదీ. మీ ప్ర‌ద‌ర్శ‌న భార‌తీయ యువ‌తీ యువ‌కుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Also Read : Jogi Ramesh : వారి క‌ల‌యిక వ్యాక్సిన్ కాదు వైర‌స్

Leave A Reply

Your Email Id will not be published!