Assam CM Shah Rukh : పఠాన్ పై నిరసన షారుఖ్ ఆందోళన
హామీ ఇచ్చానన్న అస్సాం సీఎం శర్మ
Assam CM Shah Rukh : షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొణే కలిసి నటించిన పఠాన్ మూవీ దేశ వ్యాప్తంగా విడుదలైంది. కొన్ని చోట్ల సినిమాను ఆడనీయకుండా అడ్డుకున్నారు. సినిమాలోని బేషరమ్ సాంగ్ లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ కాషాయ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ మంత్రి అయితే ఏకంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
మరాఠా ఎమ్మెల్యే కూడా అడ్డుకుంటామని బహిరంగంగానే చెప్పడం, సెన్సార్ బోర్డు తిరిగి వాటిని తొలగించాలని మూవీ మేకర్స్ , నిర్మాతలను ఆదేశించింది. ఈ తరుణంలో భారీ ఎత్తున పఠాన్ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులో ఏముందోనన్న ఉత్సుకత ఫ్యాన్స్ వ్యక్తం చేశారు.
తాజాగా అస్సాంలో కొన్ని చోట్ల సినిమాను అడ్డుకున్నారు. దీంతో స్వయంగా నటుడు షారుఖ్ ఖాన్(Assam CM Shah Rukh) అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని తానే ప్రకటించారు సీఎం శర్మ. గౌహతిలో జరిగిన ఘటనపై షారుఖ్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇదే హిమంత శర్మ ఒక రోజు ముందు నిరసనల గురించి అడిగినప్పుడు షారుఖ్ ఖాన్ ఎవరు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అది వైరల్ గా మారింది. ఎలాంటి నిరసనలు తలెత్తకుండా సినిమా ఆడేలా చూస్తానని తాను నటుడు షారుఖ్ ఖాన్ కు హామీ ఇచ్చానని స్పష్టం చేశారు అస్సాం సీఎం.
శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రభుత్వ కర్తవ్యమని ఈ విషయాన్ని ఖాన్ కు తెలిపానని పేర్కొన్నారు హిమంత బిశ్వా శర్మ.
Also Read : జక్కన్నకు జేమ్స్ కితాబు