Assam CM : నా ప్రాణం ఉన్నంత వరకు బాల్యవివాహాలకు అనుమతివ్వను
దయచేసి నా మాట జాగ్రత్తగా వినండి
Assam CM : కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మరోసారి విరుచుకుపడ్డారు. బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. తాను జీవించి ఉన్నంత వరకు రాష్ట్రంలో బాల్య వివాహాలు ఉండవని స్పష్టం చేశారు. 1935 నాటి ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టంని విమర్శలు చేసారు. 2026 నాటికి రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలిస్తానని హిమంత బిస్వా శర్మ ప్రతిజ్ఞ చేశారు.
Assam CM Comments Viral
దయచేసి నా మాట జాగ్రత్తగా వినండి. నేను బతికి ఉన్నంత కాలం అస్సాంలో బాల్య వివాహాలు జరగవు. ఇదే అంశంపై హిమంత బిస్వా శర్మ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం, 1935 రద్దుకు అస్సాం కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. అస్సాం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది ముస్లింల పట్ల వివక్ష చూపుతుందని మండిపడ్డారు.
Also Read : V Hanumantha Rao : నేను ఎంపీగా పోటీ చేసి తీరుతా..పార్టీలో నాకంటే కష్టపడిన వారు ఉన్నారా..?