Assembly Elections 2023 Comment : మోగిన ఎన్నికల నగారా
ఎన్నికల సంబురం షురూ
Assembly Elections 2023 Comment : జమిలి ఎన్నికలు జరుగుతాయని అనుకున్న వారందరికి షాక్ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంబంధించి శాసన సభ ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ మేరకు సీఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది. భారీ ఎత్తున కొత్తగా ఓటర్లు నమోదు కావడం విశేషం. ఇక ప్రకటించిన రాష్ట్రాలలో తెలంగాణ, మధ్య ప్రదేశ్ , మిజోరం, ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ ఉన్నాయి.
రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ , మరో రెండింట్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కొలువు తీరాయి. ఇక కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ తెలంగాణలో సర్కార్ కొనసాగుతోంది. ఈసారి ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపనున్నాయి. కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ, సంకీర్ణ సర్కార్ కు 28 పార్టీలతో కూడిన ఇండియా కూటమికి అగ్ని పరీక్షగా మారనున్నాయి.
Assembly Elections 2023 Comment Viral
ఈసారి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల భవితవ్యాన్ని 8 కోట్లకు పైగా ఓటర్లు నిర్దేశించ నున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు స్పష్టం చేసింది సీఈసీ(CEC). ఈసారి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సమయం చాలా తక్కువగా ఇచ్చింది. ఇది శుభ పరిణామం అని చెప్పక తప్పదు. కానీ ఎప్పటి లాగే అధికార దుర్వినియోగం, మద్యం, డ్రగ్స్ , మనీ లాండరింగ్ , హవాలా ఎక్కువగా ప్రభావం చూపనున్నాయి. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని స్వయంగా సీఈసీ(CEC) రాజీవ్ కుమార్ ఒప్పుకున్నారు. ఆయా ప్రభుత్వాలు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తాయి. ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించింది సీఈసీ. ఇప్పటికే ఆయా పార్టీలు హామీల వర్షం కురిపించాయి. మాటల తూటాలు పేల్చాయి. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.
ఆయా పార్టీలన్నీ ఎవరికి వారే తాము గెలుస్తామంటున్నాయి. ఇక సర్వే సంస్థలు ఆయా పార్టీలకు వత్తాసు పలికేలా ఉన్నాయనే అపవాదు ఎదుర్కొంటున్నాయి. మొత్తంగా ప్రభుత్వాల వ్యతిరేకత ఎక్కువగా ఉందన్నది వాస్తవం. తెలంగాణలో నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది . మధ్య ప్రదేశ్ లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ , రాజస్థాన్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ , మిజోరం లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ , బీజేపీ , ఇతర పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆప్ కూడా ప్రభావం చూపనుంది.
ఇక ఎన్నికల విషయానికి వస్తే ఒక్క ఛత్తీస్ గఢ్ లోనే రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మిజోరంలో నవంబర్ 7న, తెలంగాణలో 30న, ఛత్తీస్ గఢ్ లో 7, 17న , మధ్య ప్రదేశ్ లో 17న, రాజస్థాన్ లో 23న ఎన్నికలు జరుగుతాయి. స్థానాల పరంగా చూస్తే తెలంగాణలో 119 సీట్లకు, మిజోరంలో 40 సీట్లు, మధ్య ప్రదేశ్ లో 230 స్థానాలు, రాజస్థాన్ లో 200 సీట్లు, ఛత్తీస్ గఢ్ లో 90 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి వృద్దులు, దివ్యాంగులకు వెసులుబాటు కల్పించింది సీఈసీ. వారికి వాహన సౌకర్యం సమకూర్చనుంది. లేదంటే ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ ఇచ్చింది. మొత్తంగా ఎన్నికల సమరం స్టార్ట్ అయ్యింది. ఇక సంబురాలు చేసుకోవడమే మిగిలి ఉంది.
Also Read : Revanth Reddy : ఇక సంబురాలు జరుపుకోండి
