Gajendra Singh Shekhawat: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాన్వాయ్‌పై దాడి

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాన్వాయ్‌పై దాడి

Gajendra Singh Shekhawat : హోలీ పండుగ సందర్భంగా ఓ కార్యక్రమం కోసం వెళ్లి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి వింత అనుభవం ఎదురైంది. రాజస్థాన్ లోని జోధ్‌పూర్ నగరంలో రావుజీ కి గైర్ ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్తున్నఆయన కాన్వాయ్‌ లోని ఒక వాహనంపై దాడి జరిగింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) కాన్వాయ్‌ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి హాకీ స్టిక్‌ తో దాడి చేశాడు. దీనితో కాన్వాయ్‌ లోని ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జోధ్‌పూర్‌ లోని మాండోర్ ప్రాంతంలో జరిగింది.

Attack on Gajendra Singh Shekhawat Convoy

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) తన భద్రతా సిబ్బందితో కలిసి గైర్ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆ క్రమంలో ఆయన కాన్వాయ్ ముందుకు సాగుతున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా వచ్చి హాకీ స్టిక్‌తో ఓ కారుపై దాడి చేశాడు. ఈ దాడిలో ఓ కారులో అద్దాలు పగిలాయి. కానీ ఈ ఘటనలో కేంద్రమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన అనంతరం అక్కడ గందరగోళం నెలకొంది. పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో ఈ దాడికి పాల్పడిన వ్యక్తి మాదకద్రవ్యాల బానిస అని పోలీసులు భావిస్తున్నారు. అయితే, అతని వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనలో సంబంధం ఉన్న అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాడి చేసింది ఒకరా లేక వేరే ఎవరైనా చేశారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

దాడి అనంతరం జోధ్‌పూర్ పోలీస్ కమిషనరేట్ వెంటనే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. మంత్రికి భద్రతను మరింత పెంచి, ఆయన కాన్వాయ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదనంగా షెకావత్ ఝలోరి గేట్ చేరుకున్నప్పుడు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన నగర ప్రజలను కలుసుకుని, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దాడితో జోధ్‌పూర్ నగర ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రిపై ఓ వ్యక్తి ఇలా బహిరంగ దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనితో ప్రజల భద్రతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ ఘటన అనంతరం, జోధ్‌పూర్‌ లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.

Also Read : Tushar Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై మహాత్మా గాంధీ మునిమనవడు వివాదాస్పద వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!