Swati Maliwal Attack : స్వాతి మలివాల్ ఇంటిపై దాడి
పోలీసులకు ఫిర్యాదు చేసిన చైర్ పర్సన్
Swati Maliwal Attack : ప్రముఖ నిర్మాత సాజిద్ ఖాన్ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాయడం తో ఒక్కసారిగా ఢిల్లీ కమిషనర్ ఫర్ ఉమెన్ స్వాతి మలివాల్(Swati Maliwal Attack) వార్తల్లో నిలిచారు. ఆమె సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా పేరొందారు. ఇప్పటికే మహిళల విషయంలో త్వరగా స్పందించడం, నోటీసులు జారీ చేయడం చేస్తూ వచ్చారు.
బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు సాజిద్ ఖాన్. ఆయనపై మీ టూ ఉద్యమం కింద 10 మందికి పైగా మహిళలు, మరికొందరు సినీ రంగానికి చెందిన తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఉమెన్ కమిషన్ ను ఆశ్రయించారు.
దీనిని ఆసరాగా చేసుకుని స్వాతి మలివాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తిని బిగ్ బాస్ లో ఉంచడం మంచిది కాదని, సభ్య సమాజానికి ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు.
ఆపై వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై సాజిద్ ఖాన్ అనుచరులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడతామంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా సోమవారం ఉన్నట్టుండి తాను లేని సమయంలో ఢిల్లీలోని తన నివాసం ముందు ఉన్న వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను , సంఘటనకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు. స్వాతి మలివాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Also Read : జైన్..సిసోడియాలు భగత్ సింగ్ కాలేరు