Aung San Suu Kyi : ఆంగ్ సాన్ సూకీకి మ‌రో ఆరేళ్ల జైలు శిక్ష

ఖ‌రారు చేసిన మ‌య‌న్మార్ న్యాయ‌స్థానం

Aung San Suu Kyi :  మ‌య‌న్మార్ కు చెందిన ఆంగ్ సాన్ సూకీకి అక్ర‌మాస్తుల కేసులో మ‌రో ఆరేళ్ల జైలు శిక్ష ప‌డింది. 2021లో జ‌రిగిన తిరుగుబాటులో ఆమె ప్ర‌భుత్వం నుండి అధికారాన్ని చేజిక్కించుకుంది మిల‌ట‌రీ.

అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన నాయ‌కురాలిగా పేరొందారు. ప్ర‌స్తుతం తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఆమెకు కోర్టు జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ప‌ద‌వి కోల్పోయిన ఆంగ్ సాన్ సూకీని(Aung San Suu Kyi) దోషిగా తేల్చింది కోర్టు. ఆమెకు ఆరు సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది కోర్టు. మిల‌ట‌రీ దేశాన్ని స్వాధీనం చేసుకున్న అనంత‌రం ఆమెను గృహ నిర్బంధం విధించింది.

అనంత‌రం ఆమెతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకుంది. ఇదే స‌మ‌యంలో ఆంగ్ సాన్ సూకీపై ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది మిల‌ట‌రీ ప్ర‌భుత్వం.

ఇప్ప‌టికే ప‌లు విచార‌ణ‌ల‌ను ఎదుర్కొంటోంది సూకి. దేశ ద్రోహం, అవినీతి, ఇత‌ర ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టికే ఆంగ్ సూన్ సూకీకి 11 ఏళ్ల జైలు శిక్ష ఖ‌రారైంది. ప్ర‌స్తుతం సూకీ వ‌య‌స్సు 77 ఏళ్లు.

ఆరోగ్యం, విద్య‌ను ప్రోత్స‌హించేందుకు ఆమె డా ఖిన్ కీ ఫౌండేష‌న్ ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున నిధుల‌ను దుర్వినియోగానికి పాల్ప‌డింద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

దీనిని విచారించిన కోర్టు వాస్త‌వ‌మేనంటూ తేల్చింది. దోషిగా ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా విచార‌ణ సంద‌ర్భంగా మీడియాను, ఇత‌రుల‌ను ప్ర‌వేశించ నీయ‌లేదు కోర్టు.

విచార‌ణ గురించి మాట్లాడ‌వ‌ద్దంటూ ఆమె లాయ‌ర్ల‌ను ఆదేశించింది కోర్టు. ఇదిలా ఉండ‌గా ఆంగ్ సాన్ సూకీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. జుంటా సైనిక స‌ర్కార్ ఆడుతున్న నాట‌క‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో కేంద్రం విఫ‌లం

Leave A Reply

Your Email Id will not be published!