AUS vs BAN ICC ODI World Cup : సెమీ ఫైనల్ కు ఆసిస్
వరల్డ్ కప్ సెమీస్ కు ఆసిస్
AUS vs BAN ICC ODI World Cup : ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా అద్బుతమైన విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా జరిగిన కీలక పోరులో బంగ్లాదేశ్ ను ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడించింది. నేరుగా సెమీ ఫైనల్ కు చేరుకుంది. దీంతో టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. మొత్తం నాలుగు జట్లు బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోని భారత్ టాప్ లో నిలిచింది. ఆసిస్ , సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
AUS vs BAN ICC ODI World Cup Updates
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోర్ నమోదు చేసింది. మార్ష్ మిచెల్ రెచ్చి పోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 177 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. తన జట్టుకు అద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు.
మొత్తం 132 బంతులు మాత్రమే ఎదుర్కొని 17 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. తొలి వికెట్ త్వరగా కోల్పోయినా ఆ తర్వాత డేవిడ్ వార్నర్ , మార్ష్ కలిసి పరుగులు తీయించారు. అద్భుతమైన షాట్స్ తో అలరించారు. వార్నర్ 53 రన్స్ చేస్తే, స్టీవ్ స్మిత్ 63 పరుగులతో రాణించారు. మ్యాచ్ ఓటమి పాలు కావడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉండగా ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న పాకిస్తాన్ జట్టుపై ఆ దేశంలో ఫ్యాన్స్ గరం గరంగా ఉన్నారు.
Also Read : ICC ODI World Cup Semis : సెమీస్ బెర్తులు ఖరారు