AUS vs ENG 3rd ODI : సెంచరీలతో కదం తొక్కిన హెడ్..వార్నర్
తల వంచిన ఛాంపియన్ ఇంగ్లండ్
AUS vs ENG 3rd ODI : ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సీరీస్ ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా(AUS vs ENG 3rd ODI). మూడో వన్డే మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు ఆసిస్ బ్యాటర్లు. హేడ్ దంచి కొడితే డేవిడ్ వార్నర్ దుమ్ము రేపాడు. ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. 3-0 తేడాతో సీరీస్ కైవసం చేసుకుంది.
ఇక ఈ కీలక మ్యాచ్ లో ఏకంగా 221 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు 364 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చి పోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు విల విల లాడింది. కేవలం 142 పరుగులకే చాప చుట్టేసింది. ఇక మ్యాచ్ పరంగా చూస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 355 పరుగులు చేసింది.
ఇద్దరు ఓపెనర్లు దంచి కొట్టారు. ఒక రకంగా ఇంగ్లండ్ బౌలర్లకు షాక్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్ 152 రన్స్ చేస్తే డేవిడ్ వార్నర్ 106 పరుగులు చేశారు. మొదటి వికెట్ కు 269 జోడించారు ఇద్దరూ. అనంతరం స్టివ్ స్మిత్ 21 రన్స్ చేస్తే మిచెల్ మార్ష్ 30 పరుగులతో రాణించారు.
ఇదిలా ఉండగా అనుకోకుండా వర్షం రావడంతో ఆసిస్ ఇన్నింగ్స్ ను 48 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో ఓల్లీ స్టోన్ 4 వికెట్లు తీస్తే లియామ్ డాసన్ ఒక్క వికెట్ తీశాడు. అనంతరం బరిలోకి దిగిన 31.4 ఓవర్లలో 142 పరుగులకే చాప చుట్టేసింది.
జేసన్ రాయ్ , జెమ్స్ , మలాన్ , సామ్ బిల్లింగ్స్ , మొయిన్ అలీ, బట్లర్ , వోక్స్ , సామ్ కరన్ , లిమ్ , విల్లే , అలీ స్టోన్ చాప చుట్టేశారు.
Also Read : టీమిండియాదే టి20 సీరీస్