AUSW vs INDW : భార‌త్ పై విక్ట‌రీ సెమీస్ కు ఆసిస్

6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

AUSW vs INDW : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. వ‌రుస విజ‌యాల‌తో సెమీ ఫైన‌ల్ కు చేరింది.

ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు (AUSW vs INDW)అద్బుతంగా ఆడింది. భారీ టార్గెట్ ఇచ్చింది. కానీ ఆసిస్ బ్యాట‌ర్ ల‌ను భార‌త బౌల‌ర్లు అడ్డుకోలేక పోయారు.

ఆసిస్ కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుతంగా ఆడింది. బౌల‌ర్ల కు చుక్క‌లు చూపించింది. 107 బంతులు ఆడిన ఆమె 97 ప‌రుగులు చేసింది. వ‌ర్షం కార‌ణంగా ఆట కొంత ఆల‌శ్య‌మైంది.

తిరిగి ప్రారంభ‌మైన త‌ర్వాత ఆసిస్ 28 ప‌రుగుల వ‌ద్ద ఎల్లీస్ పెర్రీ వికెట్ ను కోల్పోయింది. ఆ వెంట‌నే కెప్టెన్ లానింగ్ పెవిలియ‌న్ బాట ప‌ట్టింది. దీంతో ఆసిస్ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండ‌గానే ఆ జ‌ట్టు జ‌య‌కేత‌నం ఎగుర వేసింది.

278 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రి లోకి దిగిన ఆస్ట్రేలియా ధాటిగా ఆడింది. ఓపెన‌ర్ అలిస్సా హీలీ హాఫ్ సెంచ‌రీతో ఆక‌ట్టుకుంది. రాచెల్ హేన్స్ 43 ప‌రుగుల వ‌ద్ద నిష్క్ర‌మించింది.

లానింగ్ కు మ‌ద్ద‌తుగా హీలో నిలిచింది. అంత‌కు ముందు బ్యాటింగ్ కుదిగిన భార‌త జ‌ట్టు 7 వికెట్లు కోల్పోయి 277 ప‌రుగులు చేసింది. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 57 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. 28 బంతులు ఆడిన వ‌స్త్రాక‌ర్ 34 ర‌న్స్ ఔట్ అయింది.

స్మృతి మంధాన , ష‌ఫాలీ వ‌ర్మ వ‌ద్ద త‌క్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. ఆ త‌ర్వాత బ‌రిలోకి వ‌చ్చిన యాస్తికా భాటియా 59 ర‌న్స్ చేస్తే మిథాలీ రాజ్ అద్భుతంగా ఆడింది. 68 ప‌రుగులు స‌త్తా చాటింది.

Also Read : యుద్దానికి సిద్దం విజ‌యం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!