AUSW vs PAKW : న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఆస్ల్రేలియా మహిళా క్రికెట్ జట్టు(AUSW vs PAKW) తన హవా కొనసాగిస్తోంది. మౌంట్ మౌంగానుయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఆ తర్వాత 191 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీం కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది.
ఇక ఇప్పటికే పాకిస్తాన్ మహిళా టీం తన చిరకాల ప్రత్యర్థి భారత జట్టుతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ అలీసా హీలీ ఏకంగా 72 పరుగులు సాధించి సత్తా చాటింది.
మరో ప్లేయర్ మెగ్ లానింగ్ 35 పరుగులతో రాణించారు. అంతకు ముందు పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలింది.
ఇదిలా ఉండగా ఆసిస్ బౌలర్లు పాకిస్తాన్ ను పరుగులు చేయనీయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ కాగలిగారు. ఇక పాకిస్తాన్ జట్టులో ఆ టీమ్ కెప్టెన్ మహారూఫ్ దుమ్ము రేపింది.
తన బ్యాటింగ్ తో సత్తా చాటింది. ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఏకంగా 78 పరుగులు చేసింది. మరో క్రికెటర్ ఆలియా రియాజ్ 53 పరుగులు చేసి రాణించింది.
అయితే ఆసిస్ వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. అంతకు ముందు భారత్ తో భారీ తేడాతో ఓటమి పాలైంది పాకిస్తాన్.
Also Read : కొంపముంచిన లిక్విడ్ డైట్