Barry O’Farrell AO : త‌లైవాతో ఆస్ట్రేలియా క‌మీష‌న‌ర్ భేటీ

అద్భుత‌మైన న‌టుడని కితాబు

Barry O’Farrell AO : ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్ ను ఆస్ట్రేలియా క‌మీష‌న‌ర్ బారీ ఓ పారెల్(Barry O’Farrell) ఏవో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను క‌లిగిన అద్భుత‌మైన వ్య‌క్తి, అరుదైన న‌టుడిని క‌లుసు కోవ‌డం, వారితో సంభాషించ‌డం మ‌రిచి పోలేన‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు ఆస్ట్రేలియా క‌మీష‌న‌ర్.

ప్ర‌జాస్వామ్యానికి ప‌ట్టు కొమ్మ‌గా అల‌రారుతోంది భార‌త దేశం అని , ఇందులో భాగంగా కొన్ని త‌రాల నుంచి ఇండియా, ఆస్ట్రేలియా దేశాల మ‌ధ్య సాంస్కృతిక ప‌రంగా విడ‌దీయ లేని బంధాన్ని క‌లిగి ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు బారీ ఓ పారెల్ ఏవో. సినిమా అన్న‌ది అద్భుత‌మైన క‌ళ‌. యావ‌త్ ప్ర‌పంచాన్ని ఒక చోటుకు చేర్చే ఏకైక సాధ‌నం మూవీనే.

ఇక భార‌తీయ చ‌ల‌న చిత్ర రంగం ప్ర‌తి ఏటా వందలాది సినిమాలు తీస్తూ వ‌స్తోందన్నారు. ప్ర‌త్యేకించి సూప‌ర్ స్టార్ గా పేరు పొందిన త‌లైవా ర‌జ‌నీకాంత్ కు త‌మ దేశంలో కూడా లెక్క‌కు మించి అభిమానులు ఉన్నార‌ని తెలిపారు. త‌న‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన ఆస్ట్రేలియా క‌మీష‌న‌ర్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.

గొప్ప న‌టుడిగా ప్ర‌శంస‌లు అందుకుంటున్న త‌లైవా అత్యంత సాధార‌ణంగా ఉండ‌డం, మాతో ప్రేమ పూర్వ‌కంగా మాట్లాడ‌టం త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని, విస్తు పోయేలా చేసింద‌ని పేర్కొన్నారు బారీ ఓ పారెల్ ఏవో.

Also Read : Priyank Kharge Comment : స‌న్మానాలు వ‌ద్దు పుస్త‌కాలు ముద్దు

Leave A Reply

Your Email Id will not be published!