Australia Win : ఆరవసారి ఆసిస్ విశ్వ విజేత
భారత క్రికెటర్ల కంట తడి
Australia Win : అహ్మదాబాద్ – అంతా అనుకున్నట్టే అయ్యింది. కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు ఫలించ లేదు. ఆస్ట్రేలియా అద్భుతమైన ఆట తీరు కనబర్చింది. టోర్నీలో 2 మ్యాచ్ లు ఓడి పోయి ఆ తర్వాత పుంజుకుని ఫైనల్ దాకా వచ్చింది. ఒక్క పరాజయం అన్నది లేకుండా వరుస విజయాలతో దుమ్ము రేపింది రోహిత్ సేన.
Australia Win World Cup 2023
తొలిసారి ప్రపంచ క్రికెట్ చరిత్రలో 1975లో వరల్డ్ కప్ జరిగింది. 1983లో హర్యానా హరికేన్ కపిల్ దేవ్ సారథ్యంలో వెస్టిండీస్ ఆధిపత్యానికి తెర దించుతూ యావత్ భారత దేశం తల ఎత్తుకునేలా జాతీయ పతాకం ఎగరేసేలా చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటారు.
ఆనాడు కపిల్ దేవ్ తీసుకు వచ్చిన కప్ తో ఏకంగా భారత దేశ వ్యాప్తంగా క్రికెట్ జ్వరం వ్యాపించేలా చేశాడు. అనంతరం 2012లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలుపొందింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఇఇది ఓ రికార్డ్. ఈ టోర్నీలో డేవిడ్ వార్నర్ , మ్యాక్స్ వెల్ , ట్రావిస్ హేడ్ తమ దేశం తరపున రియల్ హీరోలుగా మారారు.
మొత్తంగా టీమిండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా. విచిత్రం ఏమిటంటే 1983లో వరల్డ్ కప్ తీసుకు వచ్చిన కపిల్ దేవ్ ను బీసీసీఐ(BCCI) ఆహ్వానం పలకక పోవడం దారుణం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
Also Read : IND vs AUS ICC ODI World Cup : ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జగజ్జేత